బ‌ర్త్ డే కు దుబాయి తీసుకెళ్ల‌లేద‌ని భ‌ర్త‌ను చంపింది.

క్ష‌ణికావేశంలో క‌ట్టుకున్న వారిని క‌డ‌తేర్చుతున్న ఘ‌ట‌న‌లు రోజూ చూస్తూనే ఉంటాం.. అటువంటి పునేలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. పుట్టిన రోజుకు దుబాయ్ తీసుకెళ్లాల‌న్న భార్య కోరిక‌ను నిరాక‌రించ‌డంతో ఆవేశానికి లోనై భ‌ర్తను కొట్టి చంపింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పూనేలో జ‌రిగింది. వివ‌రాల్లో కి వెళ్తే పూనే న‌గ‌రంలోని డీ ఏరియాకు నివాసముంటున్న నిఖిల్ ఖ‌న్నా (36) క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఇండ‌స్ట్రీలో వ్యాపారం చేస్తున్నాడు. నిఖిల్ క‌న్నారు ఆరు సంవ‌త్స‌రాల క్రితం రేణుక (38) అనే యువ‌తిని పెండ్లి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోసెప్టెంబ‌ర్ 18 న త‌న బ‌ర్త్ డేను దుబాయ్ లో జ‌రుపుకోవాల‌ని రేణుక భ‌ర్త‌ను అడిగింది. అందుకు నిఖిల్ ఒప్పుకోలేదు. ఆ త‌రువాత ఈ నెల (న‌వంబ‌ర్) 5న పెండ్లి రోజు ఉండ‌డంతో భ‌ర్త ఆశ‌ప‌డింది. కానీ భ‌ర్త నుంచి నిరాశే ఎదురైంది. దీంతో త‌మ చుట్టాల్లోని బ‌ర్త్ డే వేడుక‌లు ఉండ‌డంతో ఢిల్లీ వెళ్లాల‌ని భ‌ర్త‌ను కోరింది. దీనికి భ‌ర్త ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ప‌ట్ట‌రాని కోపంతో భ‌ర్త తో గొడ‌వ‌ప‌డింది. కోపం ఆపుకోలేక నిఖిల్ పై దాడిచేసింది. ముక్కుపై దెబ్బ‌లు బ‌లంగా త‌గ‌ల‌డంతో అత‌ను సృహా కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ నిఖిల్ మ‌ర‌ణించాడు. నిందితురాలిని అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

యుద్ద‌విమానంలో ప్ర‌ధాని మోదీ..

ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌పై ఢిల్లీలో కేసు న‌మోదు

కారు దగ్ధం బ‌య‌ట ప‌డ్డ నోట్ల కట్టలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *