– రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి
– వట్టిపల్లి గ్రామ సమీపంలో ఘటన
– కూలీలంతా కొమురవెల్లి మండలం గుర్రన్నపేట మహిళలు
కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో టాటా ఏసీ, ప్యాసింజర్ ఆటో ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరోకరు హాస్పిటల్ మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప, వట్టిపల్లి గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు ఆటోలో ఆదివారం ఉదయం జగదేవపూర్ మండలం బిజి వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతుకు పత్తి తీయడానికి వచ్చారు. కూలి పనులు ముగించుకొని తిరిగి సాయంత్రం ప్యాసింజర్ ఆటోలో స్వంత గ్రామం కొమురవెల్లి మండలం గురువన్నపేటకు వెళుతున్న క్రమంలో మునిగడప, వట్టిపల్లి గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ప్యాసింజర్ ఆటోలో ఉన్న పుట్ట జయమ్మ (58), వైనాల శిరీష (16) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గుర్రాల లక్ష్మీ (45) హాస్పిటల్ లో మృతి చెందింది కాగా బాల్ నర్సమ్మ, లచ్చమ్మ, మమత, జానమ్మ, మల్లమ్మ, లక్ష్మీలతో పాటు మరికొంతమంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ విషయం తెలుసుకున్న గురువన్నపేట గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలంకు చేరుకొని బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న జగదేవపూర్ ఎస్సై చంద్రమోహన్ ఘటనా స్థలంకు చేరుకొని తీవ్ర గాయాలైన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన జయమ్మ , శిరీషలను ప్రైవేట్ వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందువుల కల నిజం కాబోతున్నది : వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
రేవంత్ అన్నా అని పిలవగానే.. మహిళ సమస్య విన్న సీఎం
మాజీ సీఎంను కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్ భుజాలపై చేయివేసి..