సైలెంట్‌గా చంపేస్తుంది..
ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుంది. మన అలవాట్లను బట్టే రేపటి ఆరోగ్యం ఉంటుంది. రోగాలకు కారణమయ్యే అంటే రోగాలకు కారణమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లేమిటో అందరికీ తెలుసు. అన్ని రోగాలకు మూలమైన అన్నీ తెలిసినా.. వాటికి దూరంగా ఉండకపోవటం
అనారోగ్యాల బారినపడతాం. ఉరుకులు పరుగుల జీవితం… మారిన ఆహారపు అలవాట్లు, అధిక బరువు, పని ఒత్తిడి, కాలుష్యం… వంటివి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆధునిక సాంకేతికత మనిషి కదిలే పనిలేకుండా చేసింది. దీంతో మనిషి జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లలో తేడా వచ్చింది. ఇంటికీ, ఒంటికి, పనికి- సరిపడని పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఒకప్పటి పటుత్వం లేకుండా పోయింది. నేటి తరాన్ని ఎక్కవుగా వేధిస్తున్న సమస్య ‘ఒత్తిడి’. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఓ ఒత్తిడికి ప్రధాన కారణం జీవనశైలి. మారిన లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, గ్లోబలైజేషన్ తెచ్చిపెట్టిన ఒత్తిళ్లతో హైపర్‌టెన్షన్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ కేసులు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు వైద్యులు. యువత గుండెను హైపర్ టెన్షన్ నిశబ్దంగా పిండేస్తుంది. కిడ్నీ పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. గుండెజబ్బు, క్యాన్సర్‌లకూ కారణమవుతోంది. చిన్న వయస్సులోనే హైపర్
టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు హైబీపీ సమస్యలు వయసు పైబడినవారిలో అధికంగా వుండేవి. ప్రస్తుతం 30ఏళ్ల లోపు వారిని కూడా ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. కొందరిలో జన్యుపరమైన కారణాలు కావొచ్చు… కానీ ఇటీవల జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా యువత దీని బారిన పడుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరిని హైపర్‌టెన్షన్ ప్రభావితం చేస్తోంది. 30
-79 సంవత్సరాల వయస్సు గల 18.8 కోట్లమంది భారతీయులకు రక్తపోటు వున్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. 2023 జూన్ నాటికి దేశంలోని 58 లక్షల మంది మంది అధిక రక్తపోటు చికిత్స కోసం ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్‌సిఐ)’ నమోదు చేసుకుంది. అధిక
రక్తపోటు వల్ల గుండెజబ్బులు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న శైలి, శారీరక శ్రమ తగ్గిపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయి. రోజుకు 5గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వినియోగం 17-30శాతం వరకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. 2025 నాటికి సగటు జనాభాలో ఉప్పు తీసుకోవడం 30శాతం తగ్గించాల్సి వుండగా, డబ్ల్యుహెచ్‌ఓ సూచించిన ప్రిస్క్రిప్షన్‌లోని అనేక భాగాలను భారత్ ఇంకా అమలు చేయలేదు. అంతేకాదు… 2021లో దేశంలోని నాలుగు రాష్టాల్రలో జరిగిన ఒక అధ్యయనంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో ఉప్పు, చక్కెర అధికంగా వున్నట్లు కనుగొన్నారు. కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్న ఆహార పానీయాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యకరమైన. ఆహారాన్ని తీసుకోవడం, ఉప్పును తగ్గించడంపై అవగాహన పెంచాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు దేశీయ పంటలను, ఇంటి వంటలను తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం చేయడం వల్ల ఈ హైపర్ టెన్షన్ నుంచి బయటపడొచ్చు.ఇది స్టోక్రులు, గుండెపోటు, కిడ్నీఫెయిల్యూర్, హార్ట్‌ఫెయిల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తుంది. చివరి వరకు ఈ విషయం మనకు తెలియదు..అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటుంటారు. వైద్య ప్రమాణాల ప్రకారం ఃఖ మానిటర్‌లో 140/90 కంటే ఎక్కువ రీడింగ్ చూపిస్తే..అది హైపర్‌టెన్షన్‌కు కారణమవుతుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని
సంప్రదించాలి..లేదంటే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండి ఈ సైలెంట్ కిల్లర్‌ని సైలెంట్‌గానే అంతమొందించాలి!!
Check Also
flood Viral Video” ఎందుకు నాయనా అంత తొందరా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైరల్
flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అందరూ తమను పొగడాలనో, తమను ప్రత్యేకంగా చూడాలనో కొన్ని పిచ్చి …
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Viral Video” ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు రాకముందు మనుషులు రవాణా కోసం గుర్రపు బండ్లను ఉపయోగించారు. సాంకేతికత పెరిగినంకా గుర్రపు …
Xiaomi Power Bank” మీరు మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం తగ్గింపుతో.. జియోమీ పవర్ బ్యాంక్
Xiaomi Power Bank” ఫోన్ అవసరాలు ఎక్కువగా ఉన్నవారు మంచి పవర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …