లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని ఓ గేదే అమాంతం మింగేసింది. ఈఘటన మహారాష్ట్రలోని వసీం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రైతు రామ్ హరి గేదేలు పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య స్నానం చేసేందుకు వెళ్తూ తన మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును దాణా గిన్నెలో దాచిపెట్టింది. ఆ తరువాత ఆ విషయాన్ని మరిచిపోయింది. బర్రె ముందు అదే దాణా గిన్నెను వద్ద ఉంచడంతో మంగళసూత్రాన్ని దాణాతో పాటు బర్రె మింగేసింది. అనంతరం ఆమె గుర్తుకు తెచ్చకుని పశువుల డాక్టర్‌ను సంప్రదించింది. దీంతో ఆయన ఆపరేషన్ చేసి మంగళ సూత్రాన్ని బయటకు తీశారు.