మీరు వాడుతున్న మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ సరిగా రావడం లేదు వేరే నెట్ వర్క్‌కు మారితే బంగారం గిఫ్ట్ వస్తుందని చెప్పి ఉన్న బంగారం దోచుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన పెద్దమ్మ, పెంటలక్ష్మి ఇంటి ఎదుట బీడీలు చేసుకుంటున్నారు ఇంతలో వారి వద్దకు ఓ గుర్తు తెలియని దుండగుడు వచ్చి వారితో మాటలు కలిపాడు. మీరు ఏ సిమ్మ్ వాడుతున్నరు. దీని సిగ్నల్ బాగా లేదని వేరే నెట్ వర్క్ మారితే బంగారం గెలుచుకోవచ్చని ఆశ చూపించాడు. దీంతో పెద్దమ్మ నమ్మింది. అంతే కాకుండా తనకు కూడా గిఫ్ట్ వచ్చిందని అతని దగ్గర ఉన్న డబ్బులు బంగారం చూపించడంతో నమ్మకం మరింత బలపడింది. తన పై అధికారి గ్రామ సమీపంలో ఉన్నాడని చెప్పి తనతో రావాలని కోరాడు దీంతో పెద్దమ్మ అతడితో వెళ్లింది. కొంత దూరం వెళ్లాక పెద్దమ్మ ముఖంపై ఏదో స్ప్రే చేశాడు. దీంతో సృహకోల్పోయింది. వెంటనే ఆమె మెడలోని రెండు తులాల బంగారం తీసుకుని పారిపోయాడు. కొద్ది సేపటి తరువాత మేల్కొన్న పెద్దమ్మ రోదిస్తూ తన కుటుంబ సభ్యలకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.