నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహణ
గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల్లో గ్రూప్ 2 గురించే చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం గ్రూప్ 2 వాయిదా వేయాలన అభ్యర్థులు కొంత మందిని టీఎస్ పీఎస్సీని ముట్టడించారు. అంతకు ముందు అసెంబ్లీలోనూ పలువురు నాయకులకు కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రెస్ నోటును ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 2,3 తారీఖుల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. పాత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు, 29, 30 తేదీల్లో జరగాలి. దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.