Thursday , 5 December 2024

Telangana mp’s” మొదటి సారిఎంపీలుగా గెలిచిందే వీరే.. పార్ల‌మెంట్‌కు 8 మంది కొత్త‌వాళ్లే..

Telangana mp’s” 18వ లోక్ స‌భ ఎన్నిక‌లు ఫ‌లితాలు జూన్ నాలుగున వెలువ‌డ్డాయి. ఫ‌లితాలు ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగాయి. తెలంగాణాలో (Bjp) బీజేపీ,  (congress) కాంగ్రెస్ చెరో 8 సీట్లు సంపాదించుకున్నాయి.. అయితే రెండు పార్టీల్లో ఎంపీగా గెలిచిన వారిలో 8 మంది కొత్త‌వారే కావ‌డం విశేషం. ఎమ్మెల్యేలుగా ప‌నిచేసిన వారు కొంద‌ర‌యితే.. రాజ‌కీయాల్లోకి రావ‌డంతోనే ఎంపీలుగా  గెలిచిన వారు మ‌రికొంద‌రు.

ఈట‌ల రాజేంద‌ర్

(Huzurabad) హుజూరాబాద్ నుంచి తిరుగులేని నాయ‌కుడిగా చాలా సార్లు (Mla)ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి ప‌నిచేసిన (Etala rajender) ఈట‌ల రాజేంద‌ర్ మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (Medchal Malkazgiri) మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి తిరుగులేని విజ‌యాన్ని అందుకున్నారు. ఈయ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో ముఖ్య‌నాయ‌కుడు. పార్ల‌మెంట్‌లో అడుగుపెట్ట‌డం ఇదే మొద‌టిసారి.

డీకే అరుణ

అలాగే  (D.k aruna) డీకే అరుణ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన మ‌హిళా లీడ‌ర్‌గా గొప్ప‌పేరుంది. గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆమె ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఉత్కంఠ పోరులో గెలుపొందింది. ఈమె కూడా (Telangana mp’s) పార్ల‌మెంట్‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి.

Raghunandan raoర‌ఘునంద‌న్ రావు

ఇక (Dubbaka) దుబ్బాక ఎమ్మెల్యేగా ప‌నిచేసి, గ‌త అసెంబ్లీలో అదే దుబ్బాక‌ నుంచి ఓటమి పాల‌యిన (Raghunandan rao) ర‌ఘునంద‌న్ రావు మెద‌క్ లోక్ స‌భ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర నాయ‌కత్వంలో త‌న‌దైన ముద్ర వేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను మాట‌ల‌తో ముప్పు తిప్ప‌లు పెట్టే ర‌ఘునంద‌న్‌రావు లోక్‌స‌భ‌లో మొదటి త‌నసారి త‌న గ‌ళం వినిపించ‌నున్నారు.

కాంగ్రెస్ త‌రుపున గెలుపొందిన వారిలో ఖ‌మ్మం స్థానం నుంచి (Raghurama reddy) ర‌ఘురామ‌రెడ్డి, (Bhuvanagiri) భువ‌న‌గిరి నుంచి గెలుపొందిన చామ‌ల (Kiran kumar reddy) కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా పార్లమెంట్‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి.

gaddam vamshi గడ్డం వంశీ, 

పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొందిన (Gaddam Vamshi) గడ్డం వంశీ, (Warangal) వరంగ‌ల్ నుంచి (Kadiyam kavya) క‌డియం కావ్య‌, న‌ల్గొండ నుంచి గెలుపొందిన (Raghuveer reddy) రఘువీర్‌రెడ్డి లు కొత్త‌వారే. రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లోనే యువ వ‌య‌స్సులోనే ఎంపీలుగా గెలుపొంద‌డంతో అంద‌రి దృష్టి వీరిపైనే ఉంది.

ర‌ఘురామ‌రెడ్డి

కిర‌ణ్‌కుమార్ రెడ్డి

 

క‌డియం కావ్య‌

 

రఘువీర్‌రెడ్డి

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com