Tspsc” తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. గవర్నర్ తమిళిసై మహేందర్ రెడ్డి నియమాకాన్ని ఆమోదించారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి నిబద్దత కలిగిన అధికారిగా పేరుంది. తన సర్వీసులో ఎక్కడా మచ్చలేకుండా అంచెలంచెలుగా ఆయన డిజిపిస్థాయికి ఎదిగారు. ఇంతకు ముందు టిఎస్ పిఎస్సీ చైర్మెన్ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే పేపర్లు లీక్ కావటం.. పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కమిషన్‌ను ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త కమిషన్ చైర్మన్ పదవికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సమర్థత, భద్రత, విశ్వసనీయత అంశాలను పరిగణలోకి తీసుకుని చైర్మన్ పోస్టుకు మహేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ తమిళిసై ఆమోదిండమంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు.కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో బోర్డు విమర్శల పాలయింది. మళ్లీ మళ్లీ పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అందుకు అనుగుణంగా కమిషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును నియమించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ పక్రియ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ వార్త చదవండి
Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు
నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉండగా.. ఛైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. ఇక, బోర్డులో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టుకు నిబంధనల ప్రకారం ఇతర రాష్టాల్రకు చెందిన, తెలంగాణ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాల్సి ఉంటుంది. గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి సంతోష్.. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైన నేపథ్యంలో ఇక సభ్యుల నియామకంపై దృష్టి సారించనుంది. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇతర రాష్టాల్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది. కొన్ని రాష్టాల్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరును పరిశీలించ నుంది. తర్వాత అధ్యయన నివేదిక సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ
ఛైర్మన్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. కొత్త బోర్డు నియమించిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రూప్-2 పరీక్షలతో ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి
Viraral Videos” మార్నింగ్‌లో ఎద్దు దాడి.. వృద్దుడి మృతి.. కెమెరాల్లో రికార్డు
Panchayat Elections” గ్రామాల్లో ఇక స్పెషలాఫీసర్ల పాలన..?