నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి చెరువుదగ్గరకు తల్లీ, కూతురు వెళ్లారు. ఈ క్రమంలో కూతురు కాలు జారి చెరువులో పడింది. కాపాడుదామని పోయిన తల్లి కూడా మృతి చెందింది. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో, నాగర్ కర్నూల్ మండలం నాగనూల్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నారమ్మ (62), ఆమె కూతురు సైదమ్మ (42) బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు.బట్టలు ఉతుకుతున్న క్రమంలో సైదమ్మ కాలు జారి చెరువులో పడింది. గమనించిన నారమ్మ బిడ్డను కాపాడుదామని ప్రయత్నించే క్రమంలోఆమె కూడా నీటిలో మునిగిపోయింది. శనివారం రాత్రయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఆదివారం చెరువులో ఒక మృత దేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు చేపల వలతో మరో డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.