ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మను 9 రోజులు చెరువులో వేయడం ఆనవాయితీ. అందుకోసం ఊర చెరువులో చెత్తా చెదారం తొలగించేందుకు చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు దగ్గరకు చేరకుని స్థానికుల సాయంతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు. వారిని బాబు, భారతి, యాదమ్మగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేస్తున్నారు.
Check Also
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే హానర్ ఫోన్లను ఒకసారి పరిశీలించండి. అతి తక్కువ …