tadikal” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
భర్త మానసిక, శారీరక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషాదకర ఘటనపై కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి స్పందిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
మృతురాలు తాడికల్ గ్రామానికి చెందిన అమ్మిగల్ల శ్రావ్య కాగా, ఆమె వివాహం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామానికి చెందిన అమ్మిగల్ల ధర్మ తేజతో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. అయితే వివాహానంతరం దంపతుల మధ్య మనస్పర్థలు రావడం ప్రారంభమైంది. శ్రావ్య భర్త తరచూ మానసికంగా మరియు శారీరకంగా వేధించేవాడని, ఈ వేధింపుల వల్ల ఆమె రెండు సంవత్సరాల క్రితం తన తల్లి ఇంటికి తాడికల్‌కు వచ్చేసింది.
గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న శ్రావ్య మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై శ్రావ్య సోదరుడు గొట్టే శివ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పూర్తి విచారణ కొనసాగుతోంది. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సమాచారం.

రాఖీ స్పెషల్ Look!
⚡ Oversized జువెల్లరీ Vibes
అక్కల స్టైల్, Rakhi Day Glow!
Fashion ante Feeling!
మీ Style కామెంట్ చెయ్యండి https://amzn.to/4mc9pSQ
