గొంతును తడుపుకునేందుకు నీళ్లులేవు, కరెంటు లేదు అంధకారంలో జీవిస్తున్నామని, కనీస వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో చత్తీస్ ఘడ్‌లోని రెండు గ్రామాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కోబ్రా జిల్లాలో రామ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సర్ధియా, బగ్దారి దంద్ గ్రామాల ఓటర్లు తమకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోతే ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు, ఎన్నికలను బహిష్కరించాలంటూ పాంప్లెంటూ పంచుతున్నారు. దీంతో పాటు బ్యానర్లు కడుతున్నారు. చత్తీస్ ఘడ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఈ గ్రామాల్లో మొదటి విడతలోనే ఎలక్షన్లు జరగనున్నాయి.