క్రికెట్ ఆడే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకూ నరాల తెగే ఉత్కంఠ ఉంటది. అందునా మన దేశంలో అయితే క్రికెట్ ఫ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఏ పని ఉన్నా వాయిదా వేసుకుని టీవీలకు అతుక్కుపోతరు. అటువండి ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్.. నాలుగేండ్లకొకసారి నిషా నషాలానికి ఎక్కించే ఆట ఇది. ఈ సారి ఇండియా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. ఇండియా క్రికెట్ టీంకు సెమీస్ గండమని ఫ్యాన్స్ అభిప్రాయం. దాటి సగర్వంగా ఫైనల్ చేరింది. 48 ఏండ్ల ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్ కు చేరింది. రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. ఇంకొకసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. మొదటి సారి కపిల్‌దేవ్ నేతృత్వంలో 1983 సెమిస్ గెలిచి ఫైనల్ చేరింది. అప్పడు పసికూనగా ఉన్న భారతటీం.. బలమైన వెస్టిండీస్ మీద గెలుస్తుందా అని అందరూ భావించారు. కానీ చరిత్ర తిరగరాసి ప్రపంచకప్‌ను తొలిసారి ముద్దాడింది.
also read తండ్రి మరణం.. భార్య విడాకులు.. తలొగ్గలేదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పినషమీ
కెన్యాపై 2003లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో మాత్రం ఓటమి పాలైంది. ఆతరువాత మళ్లా 2011లో సెమిస్‌లో పాకిస్తాన్‌ను ఓడగొట్టారు. ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి రెండోసారి వరల్డ్ కప్ ను అందుకుంది. 12 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఫైనల్ చేరింది. మళ్లీ మన ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. 2003 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం2003లో ఫైనల్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ అనాటి ఉద్విగ్న భరిత క్షణాలు గుర్తు చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సారి గెలువాలని పట్టుబడుతున్నారు. ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఉన్న భారత టీం మూడో సారి ముద్దు పెట్టాలని కసిగా ఉంది. ఒకే ఒక్క అడుగులో జగజ్జేతగా నిలవనుంది.
చదవండి ఇవి కూడా
తండ్రి మరణం.. భార్య విడాకులు.. తలొగ్గలేదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పి షమీ
రోహిత్ శర్మ చీటింగ్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్