పీసీసీ మాజీ ప్రెసిడెంట్, మాజీ మినిస్టర్ లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జనగామ టికెట్ వేరేవాళ్లకు కేటాయిస్తున్నారనే ప్రచారంనే నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఏఐసీసీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరునున్నట్టు వినికిడి. ఉమ్మడి ఏపీలో పొన్నాల లక్ష్మయ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖలకు, వైఎస్ కేబినేట్‌లో నీటి పారుదల శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణా ఏర్పడిన తరువాత మొదటి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
జనగామ నుంచి నాలుగు సార్లు
వరంగల్ జిల్లా1944 సంవత్సరం ఫిబ్రవరి 15 పొన్నాల లక్ష్మయ్య జన్మించారు. 1980 కాంగ్రెస్‌లో చేరి అప్పటి నుండి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఏపార్టీలో చేరుతారనేది ఇంకా స్ఫష్టంకాలేదు. అయితే బీఆర్ ఎస్‌లో చేరుతారని ప్రచారం. ఈ క్రమంలో జనగామ టికెట్ పల్లాకు ఇస్తున్నట్టు బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మెన్ పదవి ఇచ్చింది. మరి పొన్నాల బీఆర్ ఎస్‌లో చేరితే జనగామ టికెట్ ఇస్తారా..ఇంకేదైనా పదివిని కట్టబెడుతారా అని వేచి చూడాల్సిందే.
బీఆర్‌ఎస్‌లో పొన్నాలను చేర్చుకునేలా ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పావులు కదుపుతన్నారు. ఇప్పటికే శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరుతానంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ ప్రకటించారు. పొన్నాల బీఆర్ ఎస్‌లో చేరితే అటు జనగామ, ఇటు తెలంగాణా రాజకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పొన్నాల లక్షయ్యకు ఉన్న ఓటు బ్యాంకు బీఆర్ ఎస్ కు మళ్లి కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. జనగామలో భారత రాష్ట్ర సమితి గెలుపు సులువుతుందని రాజకీయ ఎనలిస్టులు భావిస్తున్నారు.
చదవండి
లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్
డబ్బుల వివాదం.. అత్తను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
