Jamili elections” ఎప్పటి నుంచో వినబడుతున్న జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత దేశ వ్యాప్తంగా ఒకటే ఎన్నికల నిర్వహించేందుకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను సెంట్రల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే పార్లమెంట్ శీతాకాల చర్చల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అవకాశాలున్నాయి. ఇప్పుడున్న ఎన్డీయే గవర్నమెంట్ హయాంలోనే జమిలి ఎలక్షన్ అమలు చేసి చూపెడుతామని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఇటీవల అన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ.. జమిలి ఎలక్షన్ గురించి ప్రస్తావించారు. దేశం మొత్తం ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయన్నారు. దీని ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వం జమిలి ఎలక్షన్ అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక రూపొందించింది. ఈ కమిటీ ఆధారంగా కేంద్ర సర్కారు జమిలీ ఎలక్షన్లకు ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఈ నిదికను కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్టడీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డర్ చేయండి