Young Farmers” వ్యవసాయం చేసే యువకులకు 45 ఏండ్లు వచ్చిన పెండ్లి కావడం లేదని, రైతులను పెండ్లి చేసుకునే యువతులకు ప్రోత్సాహకంగా రూ. 5 లక్షలు ఇవ్వాలని కర్నాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు ఆ రాష్ట్ర సీఎం ను కోరారు. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదింపుల కసరత్తులో భాగంగా ముఖ్య మంత్రి సిద్ధరామయ్య రైతు సంఘాల నాయకులతో సోమవారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై సభకు హాజరైన నేతలు హర్షం వ్యక్తం చేశారు. రైతు సంఘంలో సరస్సుల అభివృద్ధి, పౌష్టికాహారం పెంపుదల, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు, రైతు వర్గాల యువతలో ఆశలు రేకెత్తించేలా బడ్జెట్‌లో కార్యక్రమాలు చేపట్టాలని అన్నదాతల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి. వ్యవయసాయం చేసే యువకులను (రైతులను) పెళ్లి చేసుకునే యువతికి రూ. 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ రాష్ట్ర రైతులు కోరారు. వ్యవసాయాన్ని నమ్ముకుని, ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నా.. 45 ఏండ్లు వస్తున్నప్పటికీ యువ రైతులకు ఇంకా వివాహం కావడం లేదని అక్కడి రైతు సంఘాల ప్రతినిధులు వాపోయారు. రైతు రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే యువతికి రూ. 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్యకు రైతు సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణాలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Hukka Ban” తెలంగాణాలో హుక్కా నిషేధం
Rapido” పాపం.. పెట్రోల్ అయిపోయినా … తోసుకుంటూ వెళ్లాడు.. వీడియో వైరల్..
Rapido” పాపం.. పెట్రోల్ అయిపోయినా … తోసుకుంటూ వెళ్లాడు.. వీడియో వైరల్..