Bhatti Vikramarka” ఈ సంవత్సరం ను భూమిలేని పేదల బ్యాంకు అకౌంట్లలో 12 వేల రూపాయలు వేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ ఊరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చిందని వివరించారు. అందుకోసమే ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17 తేదిని ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించినట్టు పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి ఇదివరకే భద్రాచలంలో శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.6 లక్షలు అందజేస్తామన్నారు. ఇతర లబ్దిదారులకు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సహాయంగా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సోలార్ వ్యవసాయ మోటార్ సెట్లు తెస్తామని వివరించారు. జిల్లాలోని మధిర నియోజకవర్గంలోగల సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు చెప్పారు. సోలార్ నుంచి వచ్చే విద్యుత్ వ్యవసాయం పంపు సెట్లకు వినియోగానికి పోగా మిగిలిన కరెంటును గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి
Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవలం కేవలం రూ. 11499 కే..
Viral News” నా భర్త స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. పెండ్లయిన 40 రోజులకే..
Ganapathi Viral Video” ఒక లక్షా 25 వేల తమలపాకులతో వినాయకుడు.. వీడియో
Karnataka News” సర్వీసింగ్ చేయలేదని షోరూంకు నిప్పు.. వీడియో
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్