తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ఊపుందుకుంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. తదనుగుణంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సూర్యపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తెలంగాణా అంతటా చర్చ సాగుతోంది. ఎవరయి ఉంటారు అనేది ప్రధానంగా చర్చ. కొంతమంది బండి సంజయ్ అని, మరి కొంత మంది ఈటలరాజేందర్ అని ఎవరికి వారు తోచినట్టు చర్చిస్తున్నారు. ఈ ఇద్దరిది కరీనంగర్ జిల్లానే. ఇద్దరు బలమైనే నేతలే.
బండి సంజయ్
బండి సంజయ్ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. కింది స్థాయి నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దాకా తనదైన ముద్ర వేశారు. తెలంగాణాలో బీజేపీని శిఖరస్థాయిలో నిలబెట్టిన నాయకుడిగా ప్రజల్లో నాటుకుపోయారు. రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరాటం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజల్లోనూ బీఆర్ ఎస్ కు ప్రత్యర్థి బీజేపీనే అనే స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు బీసీ లకే ముఖ్యమంత్రి పదవి అని హైకమాండ్ ప్రకటించడంతో మళ్లీ బండి సంజయ్ పేరు చర్చకొస్తుంది.
ఈటల రాజేందర్
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు కేసీఆర్ వెన్నంటి నడిచాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. హుజూరాబాద్ నుంచి తిరుగులేని నాయకుడిగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నాడు. తెలంగాణా ఏర్పాటు అనంతరం రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. వివాదాల్లో తలదూర్చని ఆయన తెలంగాణ ఓటర్లలో సౌమ్యుడిగా పేరుంది. దీంతో పాటు తెలంగాణాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసొచ్చే అంశం. మంత్రిగా పనిచేసిన అనుభవం, సీనియర్‌గా రాజకీయనాయకుడు కావడంతో ఈటల రాజేందర్‌నే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని ఆయన వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సారి హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోని కేసీఆర్ పైనా పోటికి సై అంటున్నాడు.
ధర్మపురి అర్వింద్ కూడా రేసులోనే..
బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అర్వింద్ ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఆ జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఈ సారి అధిష్టానం నిర్ణయం మేరకు కోరుట్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్నారు. అధిష్టానం ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకోవచ్చుననేది ఆయన ప్రజల్లో టాక్.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల