లారీ టైర్‌లో గాలి నింపుతుండగా అది పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మన్సూర్ అన్సారీ (32) ఉపాధి కోసం నాలుగు సంవత్సరాల క్రితం కరీంనగర్ వచ్చాడు. ఈ క్రమంలో నగరంలో నివాసముంటు కమాన్ వద్ద ఓ పంక్చర్ షాప్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పొద్దున్న లారీ టైర్ పంక్షర్ చేశాడు. అనంతరం అందులో గాలి నింపుతుండగా ఆకస్మాత్తుగా పేలింది. దీంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే షాప్ ఓనర్ అతన్ని జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ దవఖానాకు తోలుకపోయారు. వైద్య పరీక్షల చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. మృతుడి బంధువులకంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వచ్చేశాయి..
మేజర్లు నచ్చిన వారిని పెండ్లి చేసుకునే హక్కు ఉంది…ఢిల్లీ హైకోర్టు
గోరంట్ల నుంచి కర్ణాటక వెళ్తుండగా రోడ్డు ప్రమాదం 12 మంది దుర్మరణం
వాషింగ్ మిషన్‌లో కరెన్సీ నోట్లు తరలింపు.. ఆర్మూర్‌లో 302 రైస్ కుక్కర్లు పట్టుకున్న అధికారులు