Thursday , 5 December 2024

కొడిగుడ్ల కూర వండ‌లేద‌ని భార్య‌ను చంపిన భ‌ర్త

కొడిగుడ్ల కూర వండ‌లేద‌ని భార్య‌ను భర్త హ‌త్య చేసిన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జ‌గిత్యాల ప‌ట్ట‌ణంలోని టీఆర్ న‌గ‌ర్ కు చెందిన క‌ట్ట సంజ‌య్ ఆదివారం రాత్రి మందు తాగి ఇంటికొచ్చాడు.ఇంట్లో ఉన్న భార్యను కొడిగుడ్ల కూర చేయాల్సి భార్య సుమ‌ల‌త‌కు (35) చెప్పాడు. ఇప్పుడు వీలుకాద‌ని, ప‌నిచేసి అల‌సిపోయి ఉన్నాన‌ని చెప్పింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట మాట పెరిగి గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆవేశానికి లోనైన సంజ‌య్ గొంతు నులిమి చంపి పారిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అర్థ‌రాత్రి నిద్ర‌పోతున్న భార్య‌ను గొంతునులిమి
అర్థ‌రాత్రి నిద్ర‌పోతున్న స‌మ‌యంలో భార్యను గొంతు నులిమి భ‌ర్త హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న నిజాబామాద్ జిల్లాలో సోమ‌వారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలం కుద్వాన్‌పూర్ కు చెందిన నత్తి రోజా (35)ను న‌త్తి సాగర్ భార్యా భ‌ర్త‌లు. వీరికి 13 ఏండ్ల క్రితం వివాహం అయ్యింది. పెండ్ల‌యిన తొలి నాళ్ల నుంచే భర్త సాగర్‌, అత్త పెద్దమ్మి మ‌ధ్య గొడ‌వలు జ‌ర‌గుతున్నాయి. భ‌ర్త‌, అత్త లు క‌లిసి రోజాను మానసికంగా, శారీర‌కంగా వేధించేవారు. ఈ క్ర‌మంలో నిద్రిస్తున్న సమయంలో సాగర్‌.. రోజాను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు రోజా కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

బండ‌రాయితో కొట్టి యువ‌కుడి హ‌త్య‌
హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎస్సార్‌న‌గ‌ర్‌లోని దాస‌రంలో యువ‌కుడిని దారుణంగా కొట్టి చంపిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌రుణ్ అనే యువ‌కుడు త‌న కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం తాగాడు. ఈ క్రమంలోనే అందులో ష‌రీఫ్ అనే యువ‌కుడుతో మృతుడికి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. క్ర‌మంలో గొడ‌వ పెద్ద‌ది కావ‌డం ష‌రీఫ్ బండ‌రాయితో అత్యంత ఘోరంగా త‌ర‌ణ్ త‌ల‌పై కొట్టాడు. దీన్నింత‌టిని చూసిన స్థానికులు అర‌వ‌డంతో కొట్టిన వారు అక్క‌డినుంచి పారిపోయారు. స్థానికులు 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని త‌రుణ్‌ను ద‌వాఖానాకు తీసుకెళ్లారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి త‌రుణ్ మృతిచెందాడు. నిందితుడు ష‌రీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పాత కక్షలతో వేటకొడవళ్లతో దాడి చేసి హ‌త్య‌
పాత క్ష‌క్ష‌ల‌తో ఓ వ్య‌క్తిని వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపిన ఘ‌ట‌న గుర‌జాల మండ‌లం జంగ‌మ‌హేశ్వ‌రం గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. కూనిరెడ్డి కృష్ణారెడ్డి ఊరు విడిచిపెట్టి హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డికి కృష్ణ‌రెడ్డికి పాత కొట్లాట‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే పండుగ‌కు సొంతూరికి వ‌చ్చిన కృష్ణ‌రెడ్డి వేట కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేసి హ‌త్య చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒక‌టేనుక ఒక‌టి 150 వాహ‌నాలు ఢీ ఏడుగురు మృతి

ముందున్న‌ది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో.. మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ట్వీట్‌

 

About Dc Telugu

Check Also

Puspha 2"

Puspha 2″ మ‌హిళ మృతిపై స్పందించిన పుష్ప‌-2 టీం..

Puspha 2″  పుష్ప‌-2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్లో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి …

Indiramma Indlu

Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కర‌ణ..

Indiramma indlu” ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థాకానికి సంబంధించిన ల‌బ్దిదారుల న‌మోదు, ఎంపిక కోసం మొబైల్ ఫోన్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రి …

05.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com