భూములు, ఆస్తుల కోసం రక్త సంబంధాలు అని చూడకుండా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా సోదరుడిపై ఎనిమిది సార్లు ట్రాక్టర్ మీదనుంచి పోనిచ్చి హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కు చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ అన్నదమ్ముల కుటుంబాల మధ్య చాలా కాలంగా భూములకు చెందిన కొట్లాట ఉంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం కొట్లాట ఉన్న భూముల వద్దకు ట్రాక్టర్ మీద చేరుకున్నది. కొద్దిసేపటికి అతర్ సింగ్ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అతర్ సింగ్ కుమారుడు నిర్పత్ కిందపడిపోయాడు. దీన్ని గమనించిన బహదూర్ సింగ్ వర్గం అయిన దామోదర్ నిర్పత్ పై ట్రాక్టర్ ఎక్కించి ముందుకు వెనకకు 8 సార్లు నడిపాడు. దీంతో నిర్పత్ అక్కడికక్కడే చనిపోయాడు. 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దామోదర్‌ను అరెస్ట్ చేశారు. గాయాలయిన వారిని దవఖానాక తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Check Also
Game Changer Movie” గేమ్ చేంజర్ .. అర్థం చేసుకుంటే సమాజ చేంజర్..ఇది రివ్యూకాదు.. బాగుందని చెప్పే మాట
Game Changer Movie” ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మనసుకు హత్తకుంటాయి. …