వాహన దారుల నుంచి రెండు రూపాయల లంచం తీసుకు న్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న 37 ఏండ్ల పాటు విచారణ సాగగా చివరకు వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో 1986లో ఈ కేసు నమోదైంది. 1986 లో భాగల్‌పూర్ పరిధిలోని ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు లంచం తీసుకుంటున్నట్టు బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదు అందింది. వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని భావించిన ఎస్పీ
అందు కోసం ఓ ప్లాన్ వేశారు. ఆ చెక్ పోస్టు కొంత దూరంలో ఎస్పీ ఉండి అటుగా వెళ్లే ఓ వాహనదారున్ని ఆపి ఓ రెండు రూపాలయ నోటు మీద తన సంతకం చేసి ఇచ్చారు. ముందున్న చెక్ పోస్ట్ పోలీసులు లంచం అడిగితే ఈ నోటు ఇవ్వాలని సూచించారు. చెక్ పోస్టు వద్ద లంచం అడగగానే ఎస్పీ ఇచ్చిన టును
పోలీసులకు ఇచ్చాడు. అనంతరం కొద్ది సేపటి తరువాత ఎస్పీ చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లి పోలీసులు తనిఖీ చేశారు. తాను సంతకం చేసిన నోటు దొరకడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై 37 ఏండ్ల పాటు విచారణ సాగగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది.