- అన్ని కూరగాయలు అదే దారిలో..
- రెండు మూడు రోజుల క్రితం వరకు 150
- వర్షాలతో చెడిన పంటలు
భారీ వర్షాలు, వరదలు వల్ల మళ్లా టమాటా ధర పెరిగిపోయింది. మిగిలిన కూరగాయ ధరలకు కూడా రెక్కలొచ్చాయ.. వేసవి కాలంలో రైతుల కూరగాయ తోటలు పెంచకపోవడం. ముఖ్యంగా టమాటను వేసవిలో పండించకపోవడంతో 10 రోజుల క్రితం వరకు టమాట ధర విపరీతంగా పెరిగింది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు అన్ని కూరగాయ పంటల సాగు ఊపందకుంది. ఈ క్రమంలో టమాట ధర కొంత తగ్గతూ వచ్చింది. మరి కొన్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల టమాట చేతికందితే సాధారణ ధరకే టమాట లభించేది కాని వర్షాలు, వరదలు వల్ల టమాట, ఇతర కూరగాయ పంటలు కుళ్లిపోయాయి. దీంతో మళ్లీ టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. .నిన్న మొన్నటి వరకు టమాటా ధర 150 కి అటు ఇటుగా ఉండేది. ఈ రోజు ఏపిలోని మదనపల్లి మార్కట్లో టమాటా ధర మళ్లీ 200కి చేరింది. అన్ని కూరగాయల ధరలు అదే దారిలో వెళ్తున్నాయి. ఏ కూరగాయ కొన్న 100 కు తక్కువగా లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. వంకాయ రూ.50, బెండకాయ రూ. 50, పచ్చిమిర్చి 140, కాకర 80, బీరకాయ రూ. 120, కాలీఫ్లవర్ రూ. 80, క్యాబేజి రూ. 50 ధర పలుకుతుంది.