ఐదేళ్ల బాలిక మృతిపై కేర‌ళ పోలీసుల క్ష‌మాప‌ణ‌

  • సారీ డాట‌ర్ అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్టు

కేర‌ళ‌లో సంచ‌ల‌నం రేకెత్తించిన ఐదేండ్ల బాలిక కిడ్నాప్ క‌థ విషాదంతో ముగిసింది. ఐదేండ్ల బాలిక‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేయ‌డంతో బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఫిర్యాదు ను స్వీక‌రించిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా వారికి ఓ గోనె సంచిలో మూటిక‌ట్టి ఉన్న పాప మృత‌దేహం క‌న్పించింది. పాప డెడ్ బాడీని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప‌రీక్ష‌లు జ‌రుపుగా నిందితుడు పాప పై అత్య‌చారం చేసి హ‌త్య చేసిన‌ట్టు తేలింది. బాలిక‌పై అత్యాచారం చేసి అనంత‌రం మృత‌దేహాన్ని గొనె సంచిలో క‌ట్టి నిర్మానుష్య ప్రాంతంలో ప‌డేసిన‌ట్టు పోలీసులు తెలిపారు . నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. అనంత‌రం పోలీసుల అధికార ట్విట‌ర్ ఖాతాలో సారీ డాట‌ర్ అంటూ నిన్ను ప్రాణాల‌తో త‌ల్లిదండ్ర‌లకు అప్ప‌గించ‌డంలో విఫ‌ల‌మయ్యాం అంటూ పోస్టులో రాసుకొచ్చారు.

http://<blockquote class=”twitter-tweet”><p lang=”ml” dir=”ltr”>മകളേ മാപ്പ്🌹<a href=”https://twitter.com/hashtag/keralapolice?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#keralapolice</a> <a href=”https://t.co/cCY3boF8hM”>pic.twitter.com/cCY3boF8hM</a></p>&mdash; Kerala Police (@TheKeralaPolice) <a href=”https://twitter.com/TheKeralaPolice/status/1685238309721903104?ref_src=twsrc%5Etfw”>July 29, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *