పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్లోని ఖైబర్ పంఖ్తున్ ఖ్వా రీజియన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బజౌర్ జిల్లాలోని ఖార్ పరిధిలోని షిండే మోర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. జమైత్ ఉలేమా ఇ ఇస్లాం పజ్ల్ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సభ లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటలో 44 మంది పౌరులు మృతి చెందగా 150
మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ సభలో 500 మంది ఉన్నారు. బాంబు దాడి ఘటన సమాచారం అందకున్న వెంటనే పోలీసులు, బాంబు డిస్పోజబుల్ బృందాలు సహయాక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను, క్షతగాత్రులను ఖార్ ఆస్పత్రికి తరలించాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఖండించారు.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …