పాకిస్తాన్‌లో బాంబుల మోత‌

పాకిస్తాన్ మ‌రోసారి బాంబుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. పాకిస్తాన్లోని ఖైబ‌ర్ పంఖ్తున్ ఖ్వా రీజియ‌న్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. బ‌జౌర్ జిల్లాలోని ఖార్ ప‌రిధిలోని షిండే మోర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జ‌మైత్ ఉలేమా ఇ ఇస్లాం ప‌జ్ల్ అనే రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసిన స‌భ ల‌క్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌లో 44 మంది పౌరులు మృతి చెంద‌గా 150
మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆ స‌భలో 500 మంది ఉన్నారు. బాంబు దాడి ఘ‌ట‌న స‌మాచారం అంద‌కున్న వెంట‌నే పోలీసులు, బాంబు డిస్పోజ‌బుల్ బృందాలు స‌హ‌యాక చ‌ర్య‌లు చేపట్టాయి. మృతదేహాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ఖార్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాయి. పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్
ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *