మే 31, 2025 | హైదరాబాద్:
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం, ఈరోజు నాటికి దేశంలో 2,710 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1170 మంది డిశ్చార్జ్ అయ్యారు. అ అలాగే, 7 మరణాలు కూడా నమోదైనట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ముఖ్యంగా ప్రభావిత రాష్ట్రాలు:
కేరళలో 1147 కేసులు
మహారాష్ట్ర 424
ఢిల్లీలో 294
గుజరాత్లో 223 కేసులు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా రోజువారీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
కరోనా లక్షణాలు:
ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తున్నాయి:
జ్వరం
దగ్గు
తలనొప్పి
కండరాల నొప్పి
చలితో కూడిన వణుకు
గొంతులో గరగర
వాసన తెలియకపోవడం
ఆరోగ్య నిపుణుల సూచన:
ప్రజలు మాస్కులు ధరించాలి, అవసరమైతే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య, ఆయుష్ శాఖ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి సన్నద్దతతో ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు..
మీరు మర్చిపోయినా కరోనా మిమ్మల్ని మర్చిపోదు… సామాజిక దూరం, గుంపుగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌ను ధరించండి..
