congress” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
బెజ్జంకి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
రత్నాకర్ మాట్లాడుతూ, “పేదల కోసం కట్టాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రసమయి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా విఫలమయ్యారు. శిలాఫలకాలపై ఉన్న మోజు వల్ల ఇళ్ల నిర్మాణం అసలు జరగలేదు,” అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో శిలాఫలకాలు ఉన్నా, ఇళ్లు కనిపించవని ఎద్దేవా చేశారు.
రసమయి ఆరోపణలపై స్పందించిన రత్నాకర్, ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా మంజూరు చేసిందని, అవకతవకల మాటే లేదన్నారు. “రసమయి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. పేదల సంక్షేమానికి అడ్డుపడటం దుర్మార్గం,” అన్నారు.
రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. “బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టారు. ఇప్పుడు నీతులు చెప్పడం అనవసరం,” అని అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు:
-
పులి కృష్ణ (AMC చైర్మన్)
-
అక్కర వేణి పోచయ్య యాదవ్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)
-
జిల్లా ప్రభాకర్ రావు (దేవస్థానం కమిటీ చైర్మన్)
-
చిలివేరు శ్రీనివాస్ రెడ్డి (AMC వైస్ చైర్మన్)
-
రావుల నరసయ్య, జహంగీర్, గూడెల్లి శ్రీకాంత్, మచ్చ కుమార్, మధుసూదన్, బొనగం రమేష్, బండి వేణు, రొడ్డ మల్లేశం, బోనాల మల్లేశం, లింగం తదితరులు
