Sugar mill” గత రాత్రి హర్యానాలో భారీ వర్షం కురిసింది. ఆసియాలో అత్యంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయిన యమునగర్ లోని సరస్వతి షుగర్ మిల్ లోకి వరద ప్రవేశించింది. ఈ వరద వల్ల మిల్‌లో ఉన్న చక్కెర విలువ రూ. 50 నుండి 60 కోట్ల వరకు నష్టం జరిగింది.
నష్టం వివరాలు
యమునగర్ వేర్‌హౌస్‌లో 2,20,000 క్వింటళ్లా షుగర్ నిల్వఉన్నది. దీని విలువ సుమారు రూ. 97 కోట్లు అని అంచనా వేస్తున్నారు. అధికారుల ప్రకారం.. ఈ వరదకు కారణం సమీపంలో ఉన్న కాల్వ నుండి నీరు పొంగి షుగర్ మిల్‌లోకి ప్రవేశించింది. దీంతో అందులో ఉన్న చక్కెర కరిగిపోయింది.
నష్టానికి కారణం
సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. మా వెర్‌హౌస్ కు వెనక ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ డ్రెయిన్ నుంచి నీరు రావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
గతరాత్రి తీవ్రమైన వర్షాలు పడ్డాయి. బహుశా రాత్రి 12 గంటలకు మా సెక్యూరిటీ సిబ్బంది వరద ప్రవేశించిన విషయాన్ని మాకు తెలిపారు. ఈ వరద వల్ల రూ. 50-60 కోట్లు విలువైన షుగర్ నష్టం జరిగింది,” అని రాజీవ్ మిశ్రా అన్నారు.
