Donald trump” ఇద్ద‌రు దోస్తుల మ‌ధ్య కీచులాట‌.. ఒక‌రు ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌, ఇంకొక‌రు ప్ర‌పంచ ధ‌న‌వంతుడు

Donald trump” ప్ర‌పంచ కుబేరుడు అప‌ర ధ‌న‌వంతుడు ఎలాన్ మ‌స్క్, ప్ర‌స్తుత అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ధ్య క‌య్యం మొద‌లైంది. గ‌తంలో వీరిద్ద‌రు మంచి స్నేహితులు.. గ‌త అమెరికా ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలిచేందుకు మ‌స్క్ భారీ సాయమే చేశారు. అయితే ఇటీవ‌ల వారి మ‌ధ్య చిచ్చు రేగింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విష‌యంలో ఇద్ద‌రిమ‌ధ్య కొట్లాట షురు అయ్యింది. ఈ బిల్లు ఆమోదం పొందిన మ‌రుక్ష‌ణ‌మే కొత్త పార్టీ పెడుతానంటూ ఎలాన్ మ‌స్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే దీని ప్ర‌తిస్పంద‌న ట్రంప్ కూడా స్పందించాడు.

మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వరకూ వార్తల్లో నిలిచాయి. ట్రంప్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) మాన్డేట్‌కు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని మరోసారి ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ ఎలన్ మస్క్, ప్రభుత్వ సబ్సిడీలపై ఎక్కువ‌గా ఆధారపడుతున్నారని చెప్పారు. ఆ సబ్సిడీలు లేకుండా మస్క్ వ్యాపారం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రభుత్వ సబ్సిడీలు లేక ఎలన్ మస్క్ వ్యాపారం?
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలో ఒక పోస్ట్ పెడుతూ.. మ‌స్క్ ప్రభుత్వ సబ్సిడీలు పొందని పరిస్థితిలో, అతను సాధారణంగా దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంద‌ని వ్యంగ్యంగా చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి మస్క్ యొక్క వివిధ కంపెనీలపై సబ్సిడీల ప్రభావం ను పరిగణనలోకి తీసుకుని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *