కరీంనగర్ DC :
కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అమలపరుస్తున్న ‘ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం’ (PM Internship Scheme) ద్వారా మంచి ఉపాధి శిక్షణ అవకాశం లభించనుంది. ప్రముఖ డిజిటల్ సేవల సంస్థ Paytm Payments Services Limited ఆధ్వర్యంలో కరీంనగర్లో Oil and Gas Sales Trainee విభాగంలో 9 నెలల పాటు శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ శిక్షణా కాలంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,000/- చొప్పున స్టైఫండ్ చెల్లించబడుతుందని పేర్కొన్నారు.
అర్హతలు & దరఖాస్తు విధానం, విద్యాఅర్హత :
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు ఈ అవకాశానికి అర్హులు. చివరి తేది: ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్ ద్వారా 10 నవంబర్ 2026 లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్: https://pminternship.mca.gov.in కరీంనగర్ జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వృత్తిపరమైన అనుభవాన్ని మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మరియు జిల్లా ఉపాధి కల్పనాధికారి సంయుక్తంగా కోరారు.
ఈ వార్త చదివారా.. కరీంనగర్లో అపోలో ఫార్మసీ జాబ్ మేళా
