కరీంనగర్‌లో అపోలో ఫార్మసీ జాబ్ మేళా

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అపోలో ఫార్మసీ (APOLLO PHARMACY) ప్రైవేట్ సంస్థలో వివిధ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీ వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు.

జాబ్ మేళా ముఖ్య వివరాలు:
నిర్వహించే తేది: 05.11.2026 (గురువారం). సమయం: ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు. వేదిక: ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC) / కలెక్టరేట్, రెండవ అంతస్తులో గల 202 వ గది, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, కరీంనగర్.

ఖాళీలు మరియు అర్హతల వివరాలు:
ఫార్మసిస్ట్ (Pharmacist) – 50 ఖాళీలు అర్హత: D.Pharm / B.Pharm / M.Pharm (PCI తో కూడినది). లింగం: పురుషులు మరియు మహిళలు. వయస్సు: 18 – 35 సంవత్సరాలు. ప్రాంతం: హైదరాబాద్. జీతం: ఫ్రెషర్స్‌కు నెలకు రూ. 18,500/- గ్రాస్, రూ. 2,000/- సిటీ అలవెన్స్.

ట్రైనీ ఫార్మసిస్ట్ (Trainee Pharmacist) – 30 ఖాళీలు అర్హత:
D.Pharm / B.Pharm / M.Pharm (PCI లేనివి). లింగం: పురుషులు. వయస్సు: 18 – 35 సంవత్సరాలు. ప్రాంతం: హైదరాబాద్. జీతం: రూ. 16,000/- గ్రాస్ (ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారికి).

ఫార్మసీ అసిస్టెంట్ (Pharmacy Assistant) – 30 ఖాళీలు అర్హత:
SSC & అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి. (2 సంవత్సరాల మెడికల్ స్టోర్ అనుభవం ఉండాలి). లింగం: పురుషులు. వయస్సు: 18 – 40 సంవత్సరాలు. ప్రాంతం: హైదరాబాద్. జీతం: రూ. 17,000/- నుండి రూ. 20,000/- గ్రాస్.

ఫార్మసీ ట్రైనీ & రిటైల్ ట్రైనీ అసోసియేట్ (Pharmacy Trainee & Retail Trainee Associate) – ప్రతి విభాగంలో 20 చొప్పున ఖాళీలు అర్హత: SSC & అంతకంటే ఎక్కువ. (6 నెలల నుండి 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి). లింగం: పురుషులు. వయస్సు: 18 – 26 సంవత్సరాలు. ప్రాంతం: హైదరాబాద్. జీతం: రూ. 16,000/- నుండి రూ. 19,000/- గ్రాస్ (రిటైల్ ట్రైనీ అసోసియేట్‌కు నెలకు రూ. 12,500/- నికర వేతనం)

కావాల్సిన ధ్రువపత్రాలు:
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెజ్యూమ్ (RESUME) తో పాటు S.S.C, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హత సర్టిఫికెట్లు, కులానికి సంబంధించిన ధ్రువ పత్రాలు తీసుకొని రావాలని సూచించారు. అదనంగా ఆధార్ కార్డ్, ఎస్.ఎస్.సి మెమో, కులం, స్టడీ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని ముఖ్య గమనికలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9908230384, 9963357250, 9247517517.