Bulandshahr” బులంద్‌షహర్ జిల్లా (ఉత్తరప్రదేశ్):
బులంద్‌షహర్ జిల్లాలోని జహాంగీద్ ప్రాంతంలో సంచలనకర ఘటన చోటు చేసుకుంది. డుంగ్రా జాట్ గ్రామ సమీపంలో 15 అడుగుల పొడవున్న భారీ పైథాన్ ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. గ్రామ ప్రజలు మరియు పక్కా పల్లెల్లోని వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — గ్రామంలోని కొంతమంది చిన్నపిల్లలు ఈ భారీ పామును చేతులతో పట్టుకున్నారు! ఎంత మాత్రం భయం లేకుండా, వారు పైథాన్‌ను ముద్దుగా ఎత్తుకుని, బులంద్‌షహర్-అనూప్షహర్ రోడ్డుపై దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడిచి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో వారు పైథాన్‌తో సెల్ఫీలు తీసుకుంటూ, వీడియోలు, రీల్స్ చేస్తూ మజాగా గడిపారు.
ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు, ప్రక్కా గ్రామాలవారు కూడా ఆ ఘట్టాన్ని చూడటానికి అక్కడికి చేరుకున్నారు. చివరికి, పిల్లలు ఆ పైథాన్‌ను సమీపంలోని అడవిలో వదిలేసినట్లు సమాచారం.
ఎవరికీ సమాచారం ఇవ్వలేదా?
ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ, అటవీశాఖకు గానీ, పోలీసులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. అధికారులు వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా, గ్రామస్థులు స్వయంగా పామును అడవిలో వదిలేయడం శోచనీయమైన అంశం.
In Bulandshahr, Uttar Pradesh, children caught a 15-foot python and treated it like a toy. They carried it for three kilometers, taking selfies and making reels. Later, they safely released the python into the jungle.
उत्तर प्रदेश के बुलंदशहर में बच्चों ने 15 फीट के अजगर को… pic.twitter.com/mt92SF6wkr
— durgeshkdubey (@ToolsTech4All) July 7, 2025
