Anaganaga Oka Raju” యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో సృష్టించిన సందడి తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది.
స్ట్రీమింగ్ వివరాలు
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 11వ తేదీ (బుధవారం) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ నవ్వుల విందును ఆస్వాదించవచ్చు.
వంద కోట్ల క్లబ్లో నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్తో మరోసారి మ్యాజిక్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, నవీన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని హీరోను ప్రత్యేకంగా అభినందిస్తూ, తమ కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.
