హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్’ (Osmania General Hospital) వైద్య బృందం దేశంలోనే అత్యంత అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకబిగిన 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి ఒక రోగికి అయిదు రకాల శస్త్రచికిత్సలను (Organ Transplants) విజయవంతంగా నిర్వహించారు. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన ఉస్మానియా వైద్యులు, నర్సింగ్ మరియు ఇతర సహాయక సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సిరిసిల్ల యువకుడికి పునర్జన్మ.. ఒకేసారి 5 అవయవాల మార్పిడి!

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఒక యువ ఇంజనీర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అత్యంత సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నారు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన ఈ కింది 5 అవయవాలను ఒకేసారి విజయవంతంగా మార్పిడి చేశారు:
-
జీర్ణాశయం (Stomach)
-
డ్యూడెనమ్ (Duodenum)
-
ప్యాంక్రియాస్ (Pancreas)
-
చిన్నపేగు (Small Intestine)
-
పెద్దపేగు (Colon/Large Intestine)
వైద్య చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డు అని, ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి కొనియాడారు.
‘నేషనల్ డాక్టర్స్ డే’ నాడే అద్భుత విజయం:
జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctors’ Day) రోజునే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం విశేషం. పవిత్రమైన వైద్య వృత్తికే ఈ బృందం మరింత ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశంసించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి భారీ మల్టీ-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
also read
వామ్మో ఇవేం ఎండలు.. మసులుతున్న యూరప్ అయినా ఏసీలు వాడట్లే ఎందుకంటే..?
iPhone 18 Pro Launch: ఐఫోన్ 18 ప్రో లాంచ్ తేదీలపై క్రేజీ అప్డేట్.. ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ కూడా?
