పత్తి మొక్కలు ఎండిపోకుండా బకెట్లతో నీళ్లు!వాన కోసం రైతన్న ఆరాటం: 

rain

పెద్దాపురం (జూలపల్లి): కాలం కలిసిరాక, వానదేవుడు కరుణించక తెలంగాణలో రైతన్నల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. తొలకరి చినుకులు కురవగానే ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేసిన రైతులు.. ఇప్పుడు వర్షాలు లేక పంటను కాపాడుకోవడానికి అల్లాడుతున్నారు. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ, చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు.

ప్రాణం పోస్తున్న బకెట్ నీళ్లు:

జూలపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనరసయ్య కథే ఇందుకు నిదర్శనం. వానలు పడకపోవడంతో తాను ఎంతో కష్టపడి వేసిన పత్తి మొక్కలు కళ్లముందే ఎండిపోవడం ప్రారంభించాయి. ఆ వేదన భరించలేక, మొక్కలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఒక సాహసానికి పూనుకున్నారు. పొలంలో ఉన్న ప్రతి పత్తి మొక్కకూ బకెట్ సహాయంతో చేతులతో నీళ్లు పోస్తూ వాటికి ప్రాణం పోస్తున్నారు.

ఎండ తీవ్రతకు మొక్కలు మాడిపోకుండా ఉండేందుకు బకెట్లతో నీళ్లు మోస్తూ పడుతున్న కష్టం చూసేవారిని కలచివేస్తోంది. “వానదేవుడు కరుణించి ఒక్క వర్షం పడితేనే మా పంట దక్కుతుంది. లేదంటే పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి” అని రైతు లక్ష్మీనరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

also read

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో రివ్యూ: 6500mAh బ్యాటరీతో అదుర్స్, కానీ ఇండియాలో..!

పెద్దపల్లి యువతకు సువర్ణావకాశం: ‘టాస్క్’ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు!

జగిత్యాల టు కూకట్‌పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!