Udaipur Dog Attack” కుక్క‌ల ప్రేమికుల‌కు ఇది క‌న‌ప‌ప‌డం లేదా.. ఐదేండ్ల బాలుడిపై వీడియో…

Udaipur Dog Attack”  ఉదయపూర్ (రాజస్థాన్): రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో ఓ ఐదేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం గౌతమ్ విహార్ కాలనీలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, చిన్నారి తన ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మూడు వీధి కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు గాయపడ‌గా స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో బాలుణ్ణి కుక్కలు నేలకూల్చి లాగుతూ కాటేస్తున్న దృశ్యాలు కనిపించాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి వెంటనే బయటకు వచ్చి ధైర్యంగా కుక్కలను తరిమింది. దాంతో బాలుడు మరింత గాయపడకుండా తప్పించుకున్నాడు.

దాడి అనంతరం స్థానికుల్లో భయం వాతావరణం ఏర్పడింది. నగరంలో వీధి కుక్కల పెరుగుతున్న దాడులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల, ఇదే ఉదయపూర్‌లోని మరో కాలనీలో రెండు నెలల క్రితం ఎనిమిదేళ్ల బాలుడు కూడా వీధి కుక్కల దాడికి గురై గాయపడ్డాడు. వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

స్థానికులు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల ఉధృతిని అణచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

డాగ్ లవర్స్ కు ఇలాంటి ఘటనలు కనపడట్లేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *