క‌న్న‌త‌ల్లినే ముక్క‌లుగా నరికి.. ఫ్రిజ్‌లో దాచి..

బెల్జియంలో దారుణ ఘ‌ట‌న‌
న‌వ‌మాసాలు మోసి క‌న్న త‌ల్లినే అత్యంత కిరాత‌కంగా ఆమె శ‌రీరాన్ని ముక్క‌లుగా న‌రికి ఫ్రిజ్‌లో దాచాడు. అనంత‌రం ఫ్రిజ్‌నే కాల్వ‌లో ప‌డేశాడు. ఈ ఘ‌ట‌న బెల్జియం దేశంలో చోటు చేసుకుంది. బెల్జియంలోని సెరాయింగ్‌లో జులై 10 వ తారీఖున జ‌ర‌గ‌గా ఆల‌స్యంగా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. గుర్తుతెలియ‌ని
వ్య‌క్తి పోలీసుల‌కు విషయాన్ని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఆ ప్రాంత‌లో సెర్చ్ చేయ‌గా ఏమీ దొర‌క‌లేదు. అనంత‌రం కాల్వ‌లోనూ గాలించ‌గా ఓ ఫ్రిజ్ దొరికింది. అందులో ఆమె శ‌రీర భాగాలు, రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో పాటు ప‌క్క‌నే ఉన్న కంటెయిన‌ర్లో ఆ మ‌హిళ‌ త‌ల మొండెం క‌నిపించాయి. వాటికున్నా ఆభ‌ర‌ణాలు, ట్యాటులు, ఆధారంగా బాధితురాలి ఆన‌వాళ్లు క‌నుగొన్నారు. అనంత‌రం ఆమె కుమారుడిని విచారించ‌గా ఆస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *