చంద్రయాన్ 3 సక్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్దమవుతోంది. ఆదిత్య ఎల్ వన్ 1 అనే సోలార మిషనన్ను లాంచ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఇస్రో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 2 తారీఖున ఆదిత్య ఎల్1 అనే సోలార్ మిషన్‌ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుని పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, సౌర కరోనా ఉష్ణోగ్రత్తలు గణనీయంగా పెరగడానికి గల కారణాల్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఏకంగా భూమి నుంచి ఏకంగా 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి లాంగ్రేజ్ పాయింట్ 1 వద్ద కక్ష్యలో ఉండనుంది.
ఆదిత్య ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్‌లను తీసుకెళ్లనుంది. సూర్యుడి నుంచి ప్రసరితమయ్యే అత్యంత శక్తిని తట్టుకుని కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేయనుంది. ఆదిత్య ఎల్ 1 నాలుగు నెలలు ప్రయాణించి నిర్ధిష్ట కక్ష్యలో చేరుతుంది.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
— ISRO (@isro) August 28, 2023