Friday , 26 July 2024
Breaking News

ముంగ‌ట గొయ్యి ఉంది పక్కకు జ‌రుగు

మరిన్ని ఫొటోల‌ను విడుదల చేసిన ఇస్రో

చంద్రుని ఉపరితలంపై చక్కర్లు కొడుతున్న ప్ర‌జ్ఞాన్ ఇస్రో ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ ముందుకు క‌దులుతోంది. ఈ క్ర‌మంలోనే ప్రజ్ఞాన్‌ రోవర్‌కి భారీముప్పు తప్పింది. ప్ర‌జ్ఞాన్ ప్రయాణిస్తున్న మార్గంలో అది నాలుగు విూటర్ల వెడల్పు గల గొయ్యిని గుర్తించింది. దీన్ని గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై, రోవర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన మార్గాన్ని మళ్లించుకోవాలని సూచించారు.
చంద్రుడిని హిందూరాజ్యంగా ప్రకటించాలి

దీంతో రోవర్‌ తన మార్గాన్ని మళ్లించుకుంది. ప్రస్తుతం ఇది సురక్షిత మార్గంలో పయనిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇకపోతే చంద్రుడిపై ఈ బిలాన్ని ప్రజ్ఞాన్‌ రోవర్‌ 27వ తేదీన 3 కిలోవిూటర్ల దూరంలోనే గుర్తించింది. దీంతో మార్గం మార్చు కోవాల్సిందిగా వెంటనే రోవర్‌ని ఆదేశించారు. ఇప్పుడది సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తోందని ఇస్రో ట్విటర్‌ వేదికగా తెలిపింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి, ల్యాండర్‌ మాడ్యూల్‌ రికార్డ్‌ చేస్తున్న దృశ్యాల్ని ఇస్రో సంస్థ సోషల్‌ విూడియాలో షేర్‌ చేస్తూ వస్తోంది. తొలుత ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ జారుకుంటూ కిందకు దిగిన దృశ్యాల్ని ఇస్రో పంచుకుంది. అనంతరం.. తొలుత దిగిన శివశక్తి పాయింట్‌ వద్ద రోవర్‌ చక్కర్లు కొట్టిన వీడియోని విడుదల చేశారు. అనంతరం.. అందులోని ఛేస్ట్‌ పేలోడ్‌ చంద్రుని ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును కొలిచిన వివరాల్ని ‘గ్రాఫ్‌’తో సహా ఇస్రో వెల్లడించింది. ఈ గ్రాఫ్‌ను పరిశీలించి నపుడు.. చంద్రునిపై ఉష్ణోగ్రతలు మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ నుంచి దాదాపు 55 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంకా మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయని ఇస్రో తెలిపింది. ఇదిలావుండగా.. జులై 14వ తేదీన చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ని లాంచ్‌ చేయగా, అది ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:03 గంటల సమయంలో విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యింది. దీంతో.. చంద్రుని ఉపరితలంపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. అంతేకాదు.. దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3ని ల్యాండ్‌ చేసి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

About Dc Telugu

Check Also

atal setu

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

atal setu” చావ‌డానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. స‌మ‌స్య …

Bus Accident"

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Bus Accident”  ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి ప‌శువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …

Thirupathi Crime news

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Thirupathi Crime news”  త‌న‌కు ఇష్టం లేని పెండ్లి చేశార‌ని అన్న కుటుంబాన్ని హ‌త్య చేసి త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com