తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నెల రోజుల క్రితం నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలయిన బీఆర్‌ఎస్, బీజేేపీ, కాంగ్రెస్‌లు నువ్వానేనా అన్న స్థాయిలో విమర్శలు గుపించుకుంటున్నాయి.
పశువుల దొంగతనం కేసులో 58 ఏండ్ల తర్వాత వ్యక్తి అరెస్ట్
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో సారి అధికారి రావాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. కర్ణాటక గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా తెలంగాణా కోటను గెలువాలనే ఆశతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ షెడ్యూల్ ప్రకారం నవంబర్ డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ అనూహ్య రీతిలో కేంద్రం జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశమంతా ఒకే సారి ఎలక్షన్ జరపాలని భావిస్తోంది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా వేసింది. దీంతో తెలంగాణ ఎన్నికల అంశం డైలామాలో పడింది.
ఆసక్తికరంగా కేటీఆర్ వ్యాఖ్యలు
ప్రగతి భవన్‌లో మంగళవారం బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్టోబరులో ఎన్నికలు జరగకపోవచ్చని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. అక్టోబరులో రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
వరదల ధాటికి 2 వేల మందికి పైగా మృతి
మరో ఆరు నెలల తర్వాతే తెలంగాణ ఎన్నికలు ఉండొచ్చని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలోనే జరగొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత స్పష్టత రావచ్చని తెలిపారు. జమిలి ఉన్నా లేకపోయనా తనకేం లాభం లేదని స్పష్టం చేశారు. బీఆర్ ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడే జమిలి ఎన్నికల గురించి మాట్లాడడంతో తెలంగాణ ఓటర్లు ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
మరో వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ఓ సభలో మాట్లాడుతూ…షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఇద్దరు అగ్రనేతలు ఇలా మాట్లాడడంతో తెలంగాణ ప్రజానీకం కన్ఫ్యూజన్‌లో పడ్డారు.
ఏం కష్టమొచ్చిందో… కుటుంబమంతా ఆత్మహత్య
ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఇప్పుడు ఊపు మీద పార్టీలు అప్పటి వరకు కొనసాగిస్తాయా..? ఏపార్టీ బలం పుంజుకుంటుందో.. ఏ పార్టీ బలం తగ్గిపోతుందో చెప్పలేం. అనూహ్యంగా ఏ పార్టీ యినా లీడ్‌లోకి రావొచ్చు. ఏది ఏమైనా త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత రానుంది.
మా వార్తలు మీకు నచ్చినట్టు అయితే పక్కన ఉన్న గంట ను నొక్కి notification allow అనండి..