Monday , 13 January 2025
Breaking News

ఏం కష్టమొచ్చిందో… కుటుంబమంతా ఆత్మహత్య

విశాఖపట్నం : ఏం కష్టమొచ్చిందో ఏమో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఎండీ మొహినుద్దీన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి విశాఖపట్టణంలోని మర్రిపాలంలో ఉంటున్నారు. ఆయనకు భార్య సంషినిషా, కుమార్తె జహీదా, కుమారుడు అలీ ఉన్నారు. ఆయనకు విజయనగరం జిల్లా కొత్తవలస సవిూపంలోని చింతపాలెంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులంతా కలిసి పొలంవద్దకు వెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అందరూ బావిలో దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్‌, అతడి భార్య సంషినిషా, కుమార్తె జహీదా చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేని పోలీసులు.. వారి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత

డివైడర్‌ పైకి దూసుకెళ్లిన మినీ బస్సు : ఏడుగురు మహిళలు  మ్రుతి

About Dc Telugu

Check Also

12.01.2024 D.C Telugu Cinema

OnePlus

OnePlus” వ‌న్ ప్ల‌స్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్

OnePlus ” వ‌న‌ప్ల‌స్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివ‌రాలు చూసుకున్న‌ట్ట‌యితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …

11.01.2025 D.C Telugu cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com