మన కండ్ల ముందు రోడ్డు మీద ఏదైనా జంతువు చనిపోతేనే మనస్సు కలుక్కుమంటుంది. ఒక జీవి చనిపోయిందని బాధపడుతాం. కానీ అమెరికాలోని ఓ పోలీస్ మాత్రం భారతీయ విద్యార్థి మరణం పట్ల చులకన భావం వ్యక్తం చేశాడు. గట్టిగా నవ్వుతూ ఆమె చనిపోయింది..
తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు.. డిసెంబర్లోనా..? ఎప్రిల్‌లోనా..?
ఆమె వయస్సు కూడా తక్కువే జస్ట్ 23 ఓ చెక్ రాయండి.. అంటూ అమెరికా పోలీస్ అధికారి పశువులా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన 23 ఏండ్ల కందుల జాహ్నవి అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటల్ క్యాంపస్‌లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నది. ఈ క్రమంలో జాహ్నవి రోడ్డు దాటుతుండగా డానియల్ ఆడెరర్ వేగంగా వాహనం నడుపుతూ జాహ్నవిని ఢీకొట్టాడు. దీంతో జాహ్నవి అక్కడికక్కడే మరణించింది. వెంటనే సహాయం చేయాల్సిందిపోయి. డేనియల్ తన సహోద్యోగితో ఆమె చనిపోయింది.. ఆమె సాధారణ వ్యక్తి.. ఆమె వయస్సు 26 ఏండ్లని ఆమె ప్రాణాలకు విలువలేదని ఓ చెక్ రాయండి అంటూ హేళనగా మాట్లాడాడు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోమవారం విడుదల చేసింది. ఈ క్లిప్ వైరల్ కావడంతో పోలీస్ అధికారి డేనియల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
విమానంలో పాడుపని… ట్విట్టర్‌లో వీడియో వైరల్
మా వార్తలు మీకు నచ్చినట్టయితే గంట గుర్తును నొక్కి నోటిఫికేషన్ అలో అనండి.. సమగ్రమైన వార్తలను చదవండి