ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా గత 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్‌లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 విూటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం దక్షిణ ధృవం సూర్యరశ్మి లేకుండా చీకటితో నిండిపోయే సమయం ఆసన్నమవ్వడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా ఈనెల 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లోకి పంపించారు.ఇప్పుడు మళ్లీ ల్యాండర్, రోవర్‌లు ఉన్న ప్రాంతంలో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బుధ, గురువారాల్లో సూర్యరశ్మిని ఉపయోగించుకొని.. ల్యాండర్, రోవర్‌లోని బ్యాటరీలు రీచార్జ్ అవువితాయని భావిస్తున్నారు. ఈనెల 22న ల్యాండర్, రోవర్ పనితీరును ఇస్రో పునరుద్ధరించే అవకాశముంది. బ్యాటరీలు రీచార్జ్ అయ్యి ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తే.. ఇస్రో అంతరిక్ష చరిత్రలో ఇది మరో అద్భుతం కానుంది.
చదవండి ఇవి కూడా
‘విూ గమ్యం భారత్.. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి