నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి.. 50.గొర్రెల అపహరణ..

అర్థరాత్రి  దుండగులు దౌర్జన్యం

నల్లచెరువు సెప్టెంబర్ 21

గొర్రెల కాపరుల నోటికి ప్లాస్టర్ వేసి వారి కాళ్లు చేతులను కట్టివేసి వారిని గాయపరిచి 50 గొర్రెలను అపహరించిన సంఘటన మండల కేంద్రం నీలవాండ్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని నీలవాండ్లపల్లి గ్రామానికి చెందిన పక్కీరప్ప,గోవిందమ్మ దంపతులు గొర్రెలను మేతకు తీసుకెళ్లి ప్రతిరోజులాగానే గ్రామానికి సమీపంలోని చెరువు వద్ద ఏర్పాటు చేసుకున్న గొర్రెల మందలోకి తమ గొర్రెలను తీసుకెళ్లారు.

బుధవారం అర్ధరాత్రి గొర్రెల మందపై 10మంది వరకు గుర్తు తెలియని దుండగులు దాడిచేశారని పోలీసుల ముందు వాపాయినట్లు తెలిపారు.తమలను కట్టెలతో కొట్టి గాయపరిచి తమ నోటికి ప్లాస్టర్ వేసి కాళ్లు చేతులు కట్టివేసి 50 గొర్రెలను అపహరించినట్లు పేర్కొన్నారు.దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయల వరకు తాము నష్టపోయామని ఆవేదన చెందినట్లు తెలిపారు.దుండగులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.గొర్రెల మేపుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఉన్నట్టుండి దుండగల రూపంలో ఇంతటి నష్టం వాటిల్లడంతో బాధితులు లబోదిబోమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్చార్జ్ తనకల్లు ఎస్సై పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *