ప‌డుసు వ‌య‌స్సు.. చెబితే విన‌రు.. అట్టిగా ప్రాణాలు పోతున్న‌య్

చెబితే విన‌న‌ప్పుడు చెడంగా చూడ‌ల‌నేది ఓ సామెత‌.. కానీ ఇప్పుడు ప్రాణాలే పోతున్నాయ్‌.. ప‌డుసు వ‌య‌స్సు ఉడుకు ర‌క్తం ఏదో చేయాల‌నుకుంటే ఏదో అవుతుంది. ఇప్పుడు టీనేజ్ పిల్ల‌లు రీల్స్ కోసం ఎంత‌టి సాహ‌సాన్నైనా చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. ఓ పిల్ల‌వాడు రైలు ప‌ట్టాల‌మీద రీల్స్ చేస్తున్నాడు. అప్పుడే రైలు రావ‌డంతో ప్రాణాలు గాల్లోక‌లిశాయి. వివ‌రాల్లోకి వెళ్తే… ఫ‌ర్మాన్ అనే 14 ఏండ్ల యువ‌కుడు ఉత్తరప్రదేశ్‌ బబారబంకి ప్రాంతంలో నివాస‌ముంటున్నాడు. ఇన్‌స్టా రీల్ చేస్తూ గుర్తింపుకోసం త‌హ‌త‌హ‌లాడుతున్నడు. ఈ క్ర‌మంలో రైలు ప‌ట్టాల‌మీద రీల్స్ చేస్తున్న స‌మ‌యంలో రైలు వ‌చ్చి ఢీకొన‌డంతో మృతి చెందాడు. దీనికి సంబంధిచిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌మాచారం అందుకు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.

చ‌ద‌వండి ఇవికూడా…

త‌న‌కంటే ఉన్న‌తాధికారిణి అవుతుందేమోన‌ని.. మ‌హిళా కానిస్టేబుల్ చంపిండు. రెండేండ్ల‌కు దొరికిండు

గూగుల్ మ్యాప్‌.. ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి

అయ్యో చిన్నారి… షాపింగ్ మాల్‌లో క‌రెంట్‌షాక్‌తో నాలుగేండ్ల చిన్నారి మృతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *