తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు గవర్నమెంట్ ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు స్వీకరించేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. అనంతరం తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నిర్మల్ జిల్లాలో రెండు మండలాలు ఏర్పడుతుండగా, వనపర్తి జిల్లాలో ఒకటి మండలంగా మారనుంది. వనపర్తి జిల్లాలో ఎనిమిది గ్రామాలతో ఏదుల మండలం ఏర్పాటు కానుంది. ఈ మండలంలో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలుండనున్నాయి.
నిర్మల్లో రెండు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేరుపడిన నిర్మల్ జిల్లాలో కొత్తగా రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి. సన్వాలి, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, నిఘ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని గ్రామాలను కలుపుతూ మాలేగావ్ మండలాన్ని ప్రతిపాదించింది. ఇక బెల్తాడోరా మండలాన్ని 12 గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇందులో ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉవ్రిూ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలను కలుపుతూ మండలంగా ప్రతిపాదించింది.
Check Also
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Sony BRAVIA HD Ready TV” మంచి బ్రాండెడ్ కంపెనీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా.. సోనీ నుంచి 80 సెం.మీలు …
Power Bank” టాటా వారి పవర్ బ్యాంక్ రూ.689లకే
Power Bank” టాటావారి పవర్ బ్యాంక్ 989 రూపాయలకే అందుబాటులో ఉంది. పోర్ట్రోనిక్స్ ఇండో 10s 10000mAh పవర్ బ్యాంక్ …