కనబడని మాయగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నరు. ఏదో ఓ రకంగా వారి బుట్టలో వేసుకుని దాచుకున్న సొమ్మును ఊదేస్తున్నారు. తాజాగా ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఏం లేదు ఇంటికాడ కూసోని హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. అంటూ సైబర్ నేరగాళ్లు 13 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణేకు చెందిన ఓమహిళకు ఆన్‌లైన్‌లో గత జులై 18న సంప్రదించిన దుండగులు హోటల్స్ కు రేటింగ్ ఇవ్వాలని ఆమెకు సూచించారు. ఒక్కో రేటింగ్ కు రూ. 150 ఇస్తామని నమ్మబలికారు. ఇందుకు ఆమె ఒప్పుకోవడంతో ముందుగా కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. అవిపూర్తి చేయడంతో ఆమెకు డబ్బుల చెల్లించారు. తరువాతకొన్ని ప్రిపెయిడ్ టాస్క్‌లు పూర్తి చేయాలని సూచించారు. దీంతో ఆమె అక్టోబర్ 13 వరకు ఆమె పెద్దమొత్తం పెట్టుబడి పెట్టింది. ఆమె పెట్టిన పెట్టుబడితో పాటు లాభాన్ని తీసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ అందుకు సైబర్ నేరగాళ్లు నిరాకరించారు. ఎక్కువ రిటన్లు పొందేందుకు మరిన్ని డబ్బులు ఇన్వెస్టుచేయాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఇవి కూడా చదవండి
రిటైర్డ్ నేవి ఆఫీసర్‌కు సైబర్ వల.. రూ. 2.37 లక్షల మోసం
షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది కదా అని.. సజ్జనార్ ట్విట్.. వీడియో వైరల్