యువత ఎంజాయ్ చేయడంలో కొత్తదనం వెతుక్కుంటుంది. కానీ అది అప్పడప్పుడు ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేసేలా కూడా ఉంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ యువ ప్రేమ జంట కారులో వెళ్తూ రోడ్డుపైనే సన్‌రూప్ నుంచి బయటకు వచ్చి లిప్‌లాక్ ముద్దులతో రెచ్చిపోయింది. గాల్లో చేతులు ఉపుతూ ముందుకు సాగారు. వెనుకాల వస్తున్న మరో వాహనం వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్వేచ్చ ఉంది కదా అని ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదని ట్విట్ చేశారు. .
స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుడా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. pic.twitter.com/4PM6GDvRCc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2023
రిటైర్డ్ నేవి ఆఫీసర్‌కు సైబర్ వల.. రూ. 2.37 లక్షల మోసం