టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ విడుదలయ్యింది. 2024 మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజును వసూళ్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 17 నుంచి విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 లేట్ ఫీజుతో డిసెంబర్ 1 వరకు చెల్లించొచ్చు. 200 రూపాయలతో డిసెంబర్ 11 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 20వ తేది వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్ విద్యార్థులకు 125 రూపాయలు, 3 సబ్జెక్టులు, అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినవారు రూ. 125 చెల్లించాలని తెలిపారు. వొకేషన్ స్టూడెంట్స్ 60 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి
పొలంలో కరెంట్ తీగ.. లాగితే భార్య డొంక కదిలింది
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ